Friday, April 24, 2015

రివ్యూ : ‘దోచేయ్’ - కామెడీ గా దోచుకున్నాడు..(తెలుగు మిర్చి)



రివ్యూ : ‘దోచేయ్’ - కామెడీ గా దోచుకున్నాడు..
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5
స్వామి రారా.. చిత్రంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర సీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘సుదీర్ వర్మ’. అప్పటివరకు క్రైమ్ చిత్రాలంటే అలానే ఉండాలనే అర్ధానికి కొత్తగా క్రైమ్ కు కామెడీ కూడా జత చేసి కొత్త కామెడీ క్రైమ్ స్టొరీ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి సక్సెస్ పొందాడు. ఇప్పుడే అదే సుదీర్ వర్మ నుండి నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ అంటూ మరోసారి ప్రేక్షేకుల మనసులను దోచుకోవడానికి ఈరోజు థియేటర్స్ లోకి వచ్చాడు. కృతి సనన్ హీరోయిన్‍గా నటించిన ఈ చిత్రానికి అత్తారింటికి దారేది వంటి బ్లాకు బస్టర్ హిట్ ని ఇండస్ట్రీ కి ఇచ్చిన నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఎంత వరకు ప్రేక్షేకుల మనసు దోచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
చందు(నాగ చైతన్య) ముగ్గురు స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తన చెల్లెల్ని డాక్టర్ కోర్స్ చదివించుకుంటాడు. చందు తండ్రి సీతారాం (రావు రమేష్) మాత్రం ఓ హత్య కేసు లో జైలులో ఉంటాడు. ఇలా హ్యాపీ గా లైఫ్ సాగిపోతున్న సమయం లో ఓ రోజు మీరా (కృతి సనన్) ని చూసి ఫస్ట్ లుక్ లోనే చందు ప్రేమలో పడతాడు.
రౌడీ మాణిక్యం(పోసాని కృష్ణ మురళి) తన గ్యాంగ్ తో కలిసి బ్యాంకు రాబరి చేసి 2 కోట్ల ఫైన దొంగతనం చేస్తారు. కానీ ఓ యాక్సిడెంట్ లో ఆ డబ్బు చందు కి దొరుకుతాయి. కానీ ఆ డబ్బు రౌడీ మాణిక్యంది అన్న సంగతి చందు కు తెలియకపోవడం తో పెద్ద ఆపదలో పడతాడు. చివరికి ఆ డబ్బు చందు ఏమిచేస్తాడు..? చందు ప్రేమ ను మీరా ఒప్పుకుందా ..? చందు నుండి మాణిక్యం తన డబ్బును ఎలా తీసుకుంటాడు అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..
ప్లస్ :
నాగ చైతన్య ఈ చిత్రం లో చాల డిఫరెంట్ రోల్ లో కనిపిస్తాడు. రొమాంటిక్ సీన్స్ లలో తనకు తనే అని మరోసారి నిరూపించుకున్నాడు. కృతి సనాన్ పెద్ద పాత్ర లేకున్నప్పటికీ తన గ్లామర్ తో ప్రేక్షేకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం కామెడీ అని చెప్పాలి. వారి కామెడీ టైమింగ్ తో థియేటర్స్ లో నవ్వుల జల్లు కురిపించారు.
సెకండ్ హాఫ్ లో సప్తగిరి కామెడీ చితాన్ని ఓ రేంజి కి తీసుకెళ్ళింది. సప్తగిరి పేల్చే ఒక్కో డైలాగు ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించాయి. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా కథలో వచ్చే ట్విస్ట్ లు సినిమా చూసే వారికీ కొత్తగా అనిపిస్తాయి. అలా చేయడం లో మరోసారి సుదీర్ వర్మ విజయం సాదించాడు. చిత్రానికి మేజర్ హైలైట్ చివరి 30 నిమిషాలు. రెండవ బాగం లో టెంప్టింగ్ స్టార్ బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం ఎంట్రీ అయినప్పటి నుండి సినిమా ని ఎక్కడికో తీసుకెళ్ళింది.
అటు సీరియస్, ఇటు కామెడీ ఉండే మాణిక్యం పాత్రలో పోసాని కృష్ణ మురళి బాగా నవ్వించాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లకి కామెడీ జత కావడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. పీటర్ హేయన్ కంపోజ్ చేసిన ఓ చేజ్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంది. అలాగే చాల రోజల తర్వాత తెర ఫై మధురిమ ఐటెం సాంగ్ లో కనిపించి మాస్ ఆడియన్స్ ని మెప్పించింది.
మైనస్ :
మొదటిగా సినిమా నిడివి చాల తక్కువ. అలాగే మొదటి 30 నిముషాలు సినిమా బోర్ గా అనిపిస్తుంది. కథ లో వర్మ కాస్త మారిస్తే బాగుండేది. సినిమా చూసినంత సేపు స్వామి రారా పార్ట్ 2 చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్ పాత్రలో కనిపించిన పోసాని కృష్ణ మురళి, రవిబాబు పాత్రలు ఇంకాస్త హీరో కు తగంటూ స్ట్రాంగ్ గా ఉంటె బాగుండు. సన్నీ అందించిన మ్యూజిక్ పెద్ద వర్క్ అవుట్ కాలేదు.
సాంకేతిక పనితీరు :
సన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చాల బాగుంది సినిమాలో హైలైట్ గా కనిపిస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకాస్త కత్తెరకు పని చెపుతే బాగుండేది. కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం ఈ మూడు భాగాలను చూసుకున్న సుదీర్ వర్మ కథలో కాస్త కొత్తదనం పెడితే బాగుండు.. ముఖ్యంగా బ్రహ్మానందం ఎపిసోడ్, క్లైమాక్స్ ట్విస్ట్ లలో తన టాలెంట్ మరోసారి రుచి చూపించాడు.
చివరిగా :
మొదటిసారిగా నాగ చైతన్య చేస్తా ఓ కామెడీ క్రైమ్ & యాక్షన్ థ్రిల్లర్ తో సుదీర్ వర్మ సక్సెస్ అందుకున్నాడని చెప్పవచ్చు. సినిమా చాలా క్లాస్ గా ఉండడం వలన మాస్ ఆడియన్స్ కు పెద్ద గా నచ్చక పోవచ్చు. క్లాస్ ఆడియన్స్ ని మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. మొత్తంగా చెప్పాలంటే నాగ చైతన్య మరియు సుదీర్ వర్మ లు కలిసి కొంత మంది దోచుకొని , కొంతమందిని వదిలిసారు.
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5