తెలుగు దేశం పార్టీ నిర్వహించే మహానాడుకు హాజరు కావాలని సినీ నటుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం కోరినంటు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పవన్ కు ఆహ్వానం పంపినట్టు తాజా సమాచారం. మే 27నుండి 29 వరకూ విజయవాడలో ఈ మహానాడు జరగనుంది.
మూడు రోజుల పాటు జరిగే ఈ మహా నాడు కు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానం పంపినంటు తెలుస్తుంది. 2014 లో జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పాత్ర చాల వరకు తెలుగుదేశానికి మేలు జరిగిందన్న విషయం అందరికి తెలిసిందే..అప్పటి నుండి పవన్ – చంద్ర బాబు ఇద్దరు కలుసుకొని తాజా రాజకీయాల ఫై చర్చలు జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మహానాడుకు వస్తాడా ..? రాడ..? అనేది కొన్ని రోజులయితే కానీ తెలియదు.
(news From TeluguMirchi)