Friday, April 24, 2015

రివ్యూ : ‘దోచేయ్’ - కామెడీ గా దోచుకున్నాడు..(తెలుగు మిర్చి)



రివ్యూ : ‘దోచేయ్’ - కామెడీ గా దోచుకున్నాడు..
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5
స్వామి రారా.. చిత్రంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర సీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘సుదీర్ వర్మ’. అప్పటివరకు క్రైమ్ చిత్రాలంటే అలానే ఉండాలనే అర్ధానికి కొత్తగా క్రైమ్ కు కామెడీ కూడా జత చేసి కొత్త కామెడీ క్రైమ్ స్టొరీ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి సక్సెస్ పొందాడు. ఇప్పుడే అదే సుదీర్ వర్మ నుండి నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ అంటూ మరోసారి ప్రేక్షేకుల మనసులను దోచుకోవడానికి ఈరోజు థియేటర్స్ లోకి వచ్చాడు. కృతి సనన్ హీరోయిన్‍గా నటించిన ఈ చిత్రానికి అత్తారింటికి దారేది వంటి బ్లాకు బస్టర్ హిట్ ని ఇండస్ట్రీ కి ఇచ్చిన నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఎంత వరకు ప్రేక్షేకుల మనసు దోచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
చందు(నాగ చైతన్య) ముగ్గురు స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తన చెల్లెల్ని డాక్టర్ కోర్స్ చదివించుకుంటాడు. చందు తండ్రి సీతారాం (రావు రమేష్) మాత్రం ఓ హత్య కేసు లో జైలులో ఉంటాడు. ఇలా హ్యాపీ గా లైఫ్ సాగిపోతున్న సమయం లో ఓ రోజు మీరా (కృతి సనన్) ని చూసి ఫస్ట్ లుక్ లోనే చందు ప్రేమలో పడతాడు.
రౌడీ మాణిక్యం(పోసాని కృష్ణ మురళి) తన గ్యాంగ్ తో కలిసి బ్యాంకు రాబరి చేసి 2 కోట్ల ఫైన దొంగతనం చేస్తారు. కానీ ఓ యాక్సిడెంట్ లో ఆ డబ్బు చందు కి దొరుకుతాయి. కానీ ఆ డబ్బు రౌడీ మాణిక్యంది అన్న సంగతి చందు కు తెలియకపోవడం తో పెద్ద ఆపదలో పడతాడు. చివరికి ఆ డబ్బు చందు ఏమిచేస్తాడు..? చందు ప్రేమ ను మీరా ఒప్పుకుందా ..? చందు నుండి మాణిక్యం తన డబ్బును ఎలా తీసుకుంటాడు అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..
ప్లస్ :
నాగ చైతన్య ఈ చిత్రం లో చాల డిఫరెంట్ రోల్ లో కనిపిస్తాడు. రొమాంటిక్ సీన్స్ లలో తనకు తనే అని మరోసారి నిరూపించుకున్నాడు. కృతి సనాన్ పెద్ద పాత్ర లేకున్నప్పటికీ తన గ్లామర్ తో ప్రేక్షేకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం కామెడీ అని చెప్పాలి. వారి కామెడీ టైమింగ్ తో థియేటర్స్ లో నవ్వుల జల్లు కురిపించారు.
సెకండ్ హాఫ్ లో సప్తగిరి కామెడీ చితాన్ని ఓ రేంజి కి తీసుకెళ్ళింది. సప్తగిరి పేల్చే ఒక్కో డైలాగు ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించాయి. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా కథలో వచ్చే ట్విస్ట్ లు సినిమా చూసే వారికీ కొత్తగా అనిపిస్తాయి. అలా చేయడం లో మరోసారి సుదీర్ వర్మ విజయం సాదించాడు. చిత్రానికి మేజర్ హైలైట్ చివరి 30 నిమిషాలు. రెండవ బాగం లో టెంప్టింగ్ స్టార్ బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం ఎంట్రీ అయినప్పటి నుండి సినిమా ని ఎక్కడికో తీసుకెళ్ళింది.
అటు సీరియస్, ఇటు కామెడీ ఉండే మాణిక్యం పాత్రలో పోసాని కృష్ణ మురళి బాగా నవ్వించాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లకి కామెడీ జత కావడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. పీటర్ హేయన్ కంపోజ్ చేసిన ఓ చేజ్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంది. అలాగే చాల రోజల తర్వాత తెర ఫై మధురిమ ఐటెం సాంగ్ లో కనిపించి మాస్ ఆడియన్స్ ని మెప్పించింది.
మైనస్ :
మొదటిగా సినిమా నిడివి చాల తక్కువ. అలాగే మొదటి 30 నిముషాలు సినిమా బోర్ గా అనిపిస్తుంది. కథ లో వర్మ కాస్త మారిస్తే బాగుండేది. సినిమా చూసినంత సేపు స్వామి రారా పార్ట్ 2 చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్ పాత్రలో కనిపించిన పోసాని కృష్ణ మురళి, రవిబాబు పాత్రలు ఇంకాస్త హీరో కు తగంటూ స్ట్రాంగ్ గా ఉంటె బాగుండు. సన్నీ అందించిన మ్యూజిక్ పెద్ద వర్క్ అవుట్ కాలేదు.
సాంకేతిక పనితీరు :
సన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చాల బాగుంది సినిమాలో హైలైట్ గా కనిపిస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకాస్త కత్తెరకు పని చెపుతే బాగుండేది. కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం ఈ మూడు భాగాలను చూసుకున్న సుదీర్ వర్మ కథలో కాస్త కొత్తదనం పెడితే బాగుండు.. ముఖ్యంగా బ్రహ్మానందం ఎపిసోడ్, క్లైమాక్స్ ట్విస్ట్ లలో తన టాలెంట్ మరోసారి రుచి చూపించాడు.
చివరిగా :
మొదటిసారిగా నాగ చైతన్య చేస్తా ఓ కామెడీ క్రైమ్ & యాక్షన్ థ్రిల్లర్ తో సుదీర్ వర్మ సక్సెస్ అందుకున్నాడని చెప్పవచ్చు. సినిమా చాలా క్లాస్ గా ఉండడం వలన మాస్ ఆడియన్స్ కు పెద్ద గా నచ్చక పోవచ్చు. క్లాస్ ఆడియన్స్ ని మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. మొత్తంగా చెప్పాలంటే నాగ చైతన్య మరియు సుదీర్ వర్మ లు కలిసి కొంత మంది దోచుకొని , కొంతమందిని వదిలిసారు.
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Friday, January 23, 2015

WhatsApp on your web browser.

 

 

 

WhatsApp Web

Today, for the first time, millions of you will have the ability to use WhatsApp on your web browser. Our web client is simply an extension of your phone: the web browser mirrors conversations and messages from your mobile device -- this means all of your messages still live on your phone.
To connect your web browser to your WhatsApp client, simply open https://web.whatsapp.com in your Google Chrome browser. You will see a QR code --- scan the code inside of WhatsApp, and you’re ready to go. You have now paired WhatsApp on your phone with the WhatsApp web client. Your phone needs to stay connected to the internet for our web client to work, and please make sure to install the latest version of WhatsApp on your phone. Unfortunately for now, we will not be able to provide web client to our iOS users due to Apple platform limitations.
We really hope you find web client useful in your everyday lives.

Telugu comedian M.S. Narayana passes away


Actor and comedian M.S. Narayana,passed away at a corporate hospital here on Friday morning. He was 63. He is survived by daughter Sasikiran and son Vikram.

Doctors cited multi-organ failure as the cause of death. He was initially diagnosed with malaria in a hospital in Bhimavaram and brought to a corporate hospital here about four days ago. He then complained of chest pain and was put on ventilator for the last two days. When his kidneys did not function properly he was given dialysis too.
On Thursday evening, his condition remained critical though doctors said he was responding favourably to the treatment. However, at about 9.40 a.m. on Friday, he was declared dead. 

TS, AP CMs condole
Telangana Chief Minister K. Chandrasekhar Rao condoled the death of Narayana saying the film industry has lost a good actor. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu too condoled the actor’s untimely demise. YSR Congress President Y.S. Jagan expressed shock and grief at the death of the popular actor and conveyed his condolences to the bereaved family.

Thursday, January 22, 2015

'పీకే' నిర్మాత, దర్శకులకు నోటీసులు



(news in sakshi )
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన 'పీకే' హిందీ సినిమా కథ తన నవల నుంచి కాపీ కొట్టిందేనంటూ ఓ రచయిత పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత, దర్శకులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. తన హిందీ నవల 'ఫరిస్తా'లోని పాత్రలు, సన్నివేశాలను పీకే సినిమాలో వాడుకుని భావచౌర్యానికి పాల్పడ్డారని కపిల్ ఇసాపురి అనే రచయిత కోర్టుకు తెలిపారు.  తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు.  తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపు ఇవ్వడంతో పాటు కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని వివరించారు.

ఈ పిటిషన్ పై  విచారణ చేపట్టిన  హైకోర్టు బుధవారం పీకే సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత అభిజత్ జోషీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న తన ముందు హాజరై పిటిషనర్ ఆరోపణలపై స్పందించాలని న్యాయమూర్తి నజ్మీ వజీరి నోటీసుల్లో ఆదేశించారు.

ఇదిలా ఉండగా, సినిమా విడుదలై ఇంతకాలమైన తరువాత ఈ పిటిషన్ దాఖలు చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Health Bulletin Of Comedian M S Narayana Released




Hyderabad: Following rumours that Telugu character artiste MS Narayana had passed away, the doctors attending on the actor at the KIMS Hospital have released a health bulletin.
According to the document, the Telugu comedian is undergoing dialysis and has been put on ventilator. Following reports of death hoax, the actor's son Vikram confirmed that the condition of his father was critical but responding to treatment.
We already told you that MS Narayana was hospitalised after he complained of food poisoning on Sankranthi in Bhimavaram. He was later moved to a local hospital in Madhapur.
According to his daughter, Sasikiran, "My dad was admitted in a local hospital in Bhimavaram after he suffered a heart attack in his native place, and was later shifted to a citybased hospital."

Saturday, January 17, 2015

The Fantastic Four Trailer Is Finally Coming, Get The Details

The Fantastic Four Trailer Is Finally Coming, Get The Details image

(News By CinemaBlend.com)


We’ve been (not-so) patiently waiting for months now to get our first look at the upcoming Fantastic Four reboot, but now that exhausting period is finally coming to an end. News has come down that the debut trailer for the brand new superhero movie will be arriving in the first half of next month, attached to screenings of Kingsman: Secret Service.

Rather than just being further speculation, this is official word that has come down from none other than Simon Kinberg - The Fantastic Four’s screenwriter and producer. Following the news from earlier today that the production is heading into reshoots, the filmmaker sent an email to Latino-Review clarifying what was going on with the movie. It was in this clarification that he revealed that the film’s first teaser will be in theaters on February 13th.

As noted, this is certainly a highly anticipated trailer, as for the longest time it has felt like 20th Century Fox has been actively hiding The Fantastic Four from us. We first thought we would get a sneak peek of the movie at San Diego Comic-Con last summer, but that didn’t wind up happening. Then there were hopes that we could maybe see something at New York Comic-Con, or perhaps attached to one of 2014’s winter blockbusters – but still nothing popped up. It makes sense that the trailer will be attached to Kingsman: Secret Service, as that production also comes from Fox, but one still has to wonder why nothing was ready for Fox’s release of Exodus: Gods and Kings last month.

Moving beyond the trailer release date, Simon Kinberg used his message to calm fans who are still under the impression that reshoots translate to disaster (the truth is that almost all modern blockbusters go through them). He confirmed that The Fantastic Four will only be doing three-to-four addition days of shooting down in Louisiana, and that director Josh Trank is overseeing the whole thing. We have no idea what they will be working on, but apparently it will involve "key cast members."

Now that we have seen trailers for both The Avengers: Age of Ultron and Ant-Man, it’s nice to know that it won’t be much longer until we have our first peek at the third comic book movie of 2015. My hopes remain high, especially because of the film’s stellar cast, which includes Miles Teller (Mr. Fantastic), Kate Mara (Invisible Woman), Michael B. Jordan (The Human Torch), Jamie Bell (The Thing), and Toby Kebbell (Dr. Doom). Be sure to check back with us the week leading up to February 13th for when the trailer debuts online, and you’ll be able to find The Fantastic Four in theaters on August 7th

'ఫైనల్'ఆడతాంః ధోని


(Sakshi | Updated: January 17, 2015 00:08 (IST))
ప్రపంచకప్ మరో 28 రోజుల్లో

మెల్‌బోర్న్: వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకే భారత జట్టు ఆస్ట్రేలియాకు వచ్చిందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెప్పాడు. ‘2011నాటి ప్రదర్శన పునరావృతం చేయగలమనే ధీమాతో ఉన్నాం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మా ఆటతీరును మార్చుకుంటాం. గత రెండేళ్లుగా మా జట్టు చాలా నిలకడగా ఆడుతోంది. మార్చి 29న మెల్‌బోర్న్ మైదానంలో ఫైనల్ ఆడేందుకే మేం ఆస్ట్రేలియా వచ్చాం’ అని ధోని ధీమాగా చెప్పాడు. ముక్కోణపు వన్డే టోర్నీలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు కొత్త డ్రెస్‌తో బరిలోకి దిగనుంది.

ఈ డ్రెస్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధోని మాట్లాడాడు. అయితే టెస్టుల నుంచి ఆకస్మిక నిర్ణయంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. ‘ఏ క్రీడలో అయినా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప విషయం. దేశంలో క్రికెట్‌లో పోటీ ఎక్కువ. ఈ క్రీడలో భారత జట్టు జెర్సీని ధరించడం గొప్ప గౌరవం. ఇది నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ధోని అన్నాడు. టెస్టుల నుంచి తప్పుకోవడం వల్ల తనకు అదనంగా విశ్రాంతి దొరికిందని, దీనివల్ల తాజాగా బరిలోకి దిగుతున్నానని తెలిపాడు.

ఏ ఫార్మాట్ అయినా ఒకటే: కోహ్లి
భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఏ ఫార్మాట్‌లో అయినా తాను రాణించాలని కోరుకుంటానని వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పా డు. ‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను బాగా ఆస్వాదించాను. ఇక వన్డే ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెల వడం ఏ క్రికెటర్‌కైనా కల. దానిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఓ జట్టుగా దీనికి సంబంధించిన ప్రణాళిక మా దగ్గర ఉంది’ అని కోహ్లి అన్నాడు. ప్రపంచకప్ గెలుస్తాం

మూడు నాలుగేళ్లుగా భారత జట్టును ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మించుకున్నామని, ప్రస్తుత జట్టుకు టైటిల్ గెలిచే సత్తా ఉందని కోచ్ ఫ్లెచర్ చెప్పారు. ‘వ్యక్తిగతంగా కోచ్‌గా ఇది నాకు మూడో ప్రపంచకప్. ఈ టోర్నీని దృష్టిలో ఉంచుకునే మూడు నాలుగేళ్లుగా మేం జట్టును నిర్మించుకున్నాం. పెద్ద టోర్నీల్లో ఎలా గెలవాలనే అంశం వీరికి తెలుసు. అలాగే ఒత్తిడినీ అధిగమించగలరు. కాబట్టి ఈసారి ప్రపంచకప్ గెలుస్తాం’ అని ఫ్లెచర్ ధీమా వ్యక్తం చేశారు.

గత మూడేళ్లలో జరిగిన మూడు ఐసీసీ టోర్నీ (రెండు టి20 ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ) లలో భారత్ కేవలం రెండే మ్యాచ్‌లు ఓడిపోయిందని ఫ్లెచర్ గుర్తు చేశారు. ‘ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీలో అయినా ఒత్తిడి ఒకేలా ఉంటుంది. గత మూడేళ్లుగా పెద్ద టోర్నీల్లో ఆడిన అనుభవం వీరికి ఉపకరిస్తుంది. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఈ జట్టు విజయాలు సాధించింది. అందుకే నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని చెప్పారు. టెస్టు సిరీస్‌లో ఆడటం వల్ల జట్టులోని ఆటగాళ్లకు ఆస్ట్రేలియా పరిస్థితులపై అవగాహన వచ్చిందని తెలిపారు. ప్రపంచకప్‌కు ముందు ముక్కోణపు వన్డే టోర్నీని మంచి సన్నాహకంగా ఉపయోగించుకుంటామని చెప్పారు.

 ఒక్కో డ్రెస్ కోసం 33 ప్లాస్టిక్ సీసాలు
 భారత జట్టు ముక్కోణపు వన్డే టోర్నీలో కొత్త డ్రెస్‌తో బరిలోకి దిగబోతోంది. జట్టు దుస్తుల భాగస్వామి నైకీ గురువారం మెల్‌బోర్న్‌లో దీనిని విడుదల చేసింది. ఆటగాళ్లు ధరించే జెర్సీ, ట్రాక్ ఒక్కో దాని కోసం 33 ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసి వాడారు. ఈ దుస్తులు చాలా తక్కువ బరువుతో ఉంటాయి. అలాగే బ్యాటింగ్ కోసం, బౌలింగ్ కోసం విడివిడిగా బూట్లు తయారు చేశారు.

 ప్రాక్టీస్ మొదలు
 టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత క్రికెటర్లు శుక్రవారం తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఫీల్డింగ్, బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. కెప్టెన్ ధోని ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటంతో పాటు పేసర్ల బౌన్సర్లను ఆడటం ప్రాక్టీస్ చేశాడు. ధావన్, రహానే, రోహిత్, కోహ్లి కూడా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కోచ్ ఫ్లెచర్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇషాంత్ శర్మతో స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయించారు. రైనా, రహానేలతో కలిసి ఇషాంత్ స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం.

 భారత్‌పై చరిత్ర మారుస్తాం: యూనిస్
 కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్ ఎప్పుడూ గెలవలేదు. ఈసారి కూడా ఈ రెండు జట్లు ఫిబ్రవరి 15న తమ తొలి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈసారి భారత్‌పై గెలిచి చరిత్రను తిరగరాస్తామని పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు యూనిస్‌ఖాన్ అన్నాడు. ‘క్రికెట్‌లో అంకెలకు ప్రాధాన్యత ఉండదు. ఆ రోజు బాగా ఆడటం ముఖ్యం. మా జట్టు సమతూకంతో ఉంది. సామర్ధ్యానికి తగ్గట్లుగా రాణిస్తే భారత్‌ను ఓడించగలం. ఈసారి చరిత్రను మారుస్తాం’ అని అన్నాడు.